లాభాల్లో సూచీలు, క్యాపిటల్ గూడ్స్ సపోర్ట్

లాభాల్లో సూచీలు, క్యాపిటల్ గూడ్స్ సపోర్ట్

స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. ఇవాళ మన మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. అయితే హైయర్ లెవెల్స్‌లో అమ్మకాల ప్రభావంతో.. సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. లోయర్ లెవెల్స్‌లో ట్రేడర్స్‌ నుంచి సపోర్ట్ రావడంతో కోలుకున్న సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.

మిడ్ సెషన్ సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 41208 వద్ద ఉండగా.. 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12134 వద్ద ట్రేడవుతోంది. 117 పాయింట్లు లాభపడిన బ్యాంక్ నిఫ్టీ 30891 వద్ద నిలిచింది.

ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ 2 శాతం పైగా లాభపడడం.. మార్కెట్లను నడిపిస్తోంది. ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం ఒకటిన్నర శాతం లాభపడగా.. పీఎస్ఈ విభాగం 1 శాతం పెరిగింది.

నిఫ్టీలో యస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఎల్ అండ్ టీ, గెయిల్, గ్రాసిం షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. జీ ఎంటర్టెయిన్మెంట్, యూపీఎల్, పవర్‌గ్రిడ్ టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');