'నో' అనే ఆన్సరే నా బెస్ట్ ఫ్రెండ్ -మంచు లక్ష్మి

'నో' అనే ఆన్సరే నా బెస్ట్ ఫ్రెండ్ -మంచు లక్ష్మి

హైద్రాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఆగస్ట్ ఫెస్ట్‌లో సినీ నటి మంచు లక్ష్మి పాల్గొన్నారు. 'ఆపర్చునిటీస్ ఇన్ ఇండియన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టెయిన్మెంట్ ఇండస్ట్రీ' అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరగగా.. ఈ చర్చా కార్యక్రమంలో మంచు లక్ష్మి భాగమయ్యారు. పదేళ్లు కష్టపడితేనే ఈ స్థాయిలో ఉన్నానని  చెప్పిన మంచు లక్ష్మి.. మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి ప్రవేశించినా..  కేవలం వారసురాలిగా రాలేదని చెప్పారు. అమెరికాలో నుంచి వచ్చిన వెంటనే తనకు అవకాశాలు వెంటనే రాలేదని.. పదేళ్లు కష్టపడితేనే ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పారామె. 

తనకు విజయం కూడా అంత త్వరగా రాలేదని.. చాలా కష్టాలను ఎదుర్కున్నానని మంచు లక్ష్మి చెప్పారు. మహిళగా, ఓ పెద్ద కుటుంబానికి వారసురాలిగా, నటిగా ఎన్నో బాధ్యతలను నెరవేర్చాల్సి వచ్చిందన్న ఆమె.. తానే కాదని ఇండస్ట్రీలో ఎవరైనా సరే విజయం సాధించడం కోసం కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. 'సినీ పరిశ్రమలో నిలబడాలంటే ఎంతో కష్టపడాలి.. అంతకు మించి ప్యాషన్ కూడా ఉండాలి' అంటూ ఔత్సాహికులకు సూచనలు అందించారు మంచు లక్ష్మి.

'ప్రతీ రోజూ ఓ కొత్త ఛాలెంజ్ ఎదురవుతుంది. అవకాశాలు అడిగితే మొదట నో అనే సమాధానమే ఎదురవుతుంది. గతంలో ఇలాంటివి ఎవరూ చేయలేదు కదా!. నువ్వెందుకు ప్రయత్నించడం అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. నో అనే మాటకు ఎప్పుడూ వెనక్కు తగ్గకూడదు. నా బెస్ట్ ఫ్రెండ్ 'నో'.. కష్టపడితే అదే విజయానికి చేరువ చేస్తుందం'టూ.. సినీరంగంలో అవకాశాలు అందుకోవాలని ప్రయత్నించే ఔత్సాహికులకు మంచు లక్ష్మి మెసేజ్ ఇచ్చారు. 
 Most Popular