కెన్‌ఫిన్‌ హోమ్స్‌లో కొనసాగుతోన్న ర్యాలీ

కెన్‌ఫిన్‌ హోమ్స్‌లో కొనసాగుతోన్న ర్యాలీ

వరుసగా ఐదో రోజూ కెన్‌ఫిన్‌ హోమ్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. క్యూ-3 రిజల్ట్స్‌ స్ట్రాంగ్‌గా ఉండటంతో ఇంట్రాడేలో ఈ షేర్‌ 7.6శాతం పైగా లాభపడి రూ.498.90కి చేరింది. మార్చి 28, 2018 తర్వాత ఇదే గరిష్ట స్థాయి కావడం విశేషం. గత 5 రోజుల్లో ఈ స్టాక్‌ 32శాతం రిటర్న్స్‌ అందించింది. ప్రస్తుతం కెన్‌ఫిన్‌ హోమ్స్‌ మూడున్నర శాతం లాభంతో రూ.480 వద్ద కలాడుతోంది. ఉదయం 10:50 వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 58 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మొత్తం క్యాపిటలైజేషన్‌ రూ.6,179.68 కోట్లకు చేరింది. 

ఇక డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో కెన్‌ఫిన్‌ హోమ్స్‌ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికరలాభం 40.6శాతం వృద్ధితో రూ.106.60 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.76 కోట్లుగా నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం 23.6శాతం వృద్ధితో రూ.168.1 కోట్లకు చేరింది. అసెట్‌ క్వాలిటీ స్థిరంగా ఉండటం, మార్జిన్స్‌ పెరగడంతో తమ లాభాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది. ఇండస్ట్రీ పీ/ఈ 26.37 కాగా, కంపెనీ పీ/ఈ 18.94గా ఉంది. ఇక బుక్‌ వాల్యూ రూ.133.84 కాగా ఈపీఎస్‌ 24.48గా నమోదైంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');