లాభాల స్వీకరణలో టెలికాం స్టాక్స్‌

లాభాల స్వీకరణలో టెలికాం స్టాక్స్‌

గత కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న టెలికాం స్టాక్స్‌ ఇవాళ అనూహ్యంగా లాభాల స్వీకరణకు లోనవుతోన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌లో ఐదు రోజుల ర్యాలీకి, వొడాఫోన్‌ ఐడియాలో రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. 

ఎయిర్‌టెల్‌లో ఆరంభ లాభాలు ఆవిరి
ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే భారతీ ఎయిర్‌టెల్‌లో వరుసగా ఆరో రోజూ జోరు కనిపించింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభంతో రూ.523.75కు చేరింది. ఇది అక్టోబర్‌ 10, 2017 గరిష్ట స్థాయి కావడం విశేషం. పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డాట్‌) పెంచడంతో భారతీ ఎయిర్‌టెల్‌కు కొనుగోళ్ళ మద్దతు లభించింది. అయితే ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ప్రస్తుతం అరశాతం నష్టంతో రూ.509 వద్ద షేర్‌ కదలాడుతోంది. ఇంట్రాడేలో షేర్‌ రూ.506.70కు పడిపోయింది. ఉదయం 10:30 వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 92 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,62,427.89 కోట్లకు చేరింది.

రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌
వొడాఫోన్‌ ఐడియాలో రెండు రోజుల ర్యాలీకి ఇవాళ బ్రేక్‌ పడింది. ఒకదశలో రూ.6.03కి చేరి లాభాలను కొనసాగిస్తున్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత ఊహించని విధంగా నష్టాల్లోకి జారుకుంది. దీంతో ఇంట్రాడేలో షేర్‌ 7.50శాతం పైగా నష్టపోయింది. ప్రస్తుతం ఆరున్నర శాతం నష్టంతో రూ.5.53 వద్ద షేర్‌ కదలాడుతోంది. గత 30 రోజుల్లో ఈ షేర్‌ 9.2శాతం క్షీణించింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');