వరుసగా 11వ రోజూ వరుణ్‌ బేవరేజెస్‌లో జోరు

వరుసగా 11వ రోజూ వరుణ్‌ బేవరేజెస్‌లో జోరు

వరుణ్‌ బేవరేజెస్‌లో జోరు కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. నవంబర్‌ 7, 2016న లిస్టైన వరుణ్‌ బేవరేజెస్‌లో ఇలాంటి ర్యాలీ రావడం ఇదే ప్రథమం. దీంతో ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని టచ్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం డే గరిష్ట స్థాయి వద్ద షేర్‌ కదలాడుతోంది. ప్రస్తుతం 1.66శాతం లాభంతో రూ.801.10 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. 

నిన్న రూ.788.10 వద్ద ముగిసిన వరుణ్‌ బేవరేజెస్‌ ఇవాళ ఉదయం రూ.794.80 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఒకదశలో రూ.804కు చేరి సరికొత్త గరిష్ట స్థాయిని నెలకొల్పింది. ఉదయం 10:15 నిమిషాల వరకు మొత్తం 1.27 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 22,748.67 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 66.17గా ఉండగా, కంపెనీ పీ/ఈ 50.68గా ఉంది. ఇక బుక్‌ వాల్యూ 90.19 కాగా ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ 15.55గా ఉంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');