బ్యాంక్స్, ఐటీ సపోర్ట్ | మార్కెట్లకు లాభాలు

బ్యాంక్స్, ఐటీ సపోర్ట్ | మార్కెట్లకు లాభాలు

రెండు రోజుల పాటు కన్సాలిడేషన్‌కు గురయిన మన మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో.. ట్రేడింగ్ ఆరంభంలోనే మన సూచీలకు పాజిటివ్ సంకేతాలను అందించింది.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలతో పాటు.. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్లలో కూడా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నెగిటివ్‌గా ఉండగా పీఎస్ఈ సెక్టార్‌ 1 శాతం పైగా నష్టపోయింది. ఐటీ, టెక్నాలజీ,  బ్యాంకింగ్, హెల్త్ కేర్ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. 

ప్రస్తుతం సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 41504 వద్ద ఉండగా... 48 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 12217 వద్ద ట్రేడవుతోంది. 166 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 31110 పాయింట్ల ఎగువన నిలిచింది.

నిఫ్టీ వేదాంత, భారతి ఎయిర్టెల్, విప్రో, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా... కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, జీ ఎంటర్టెయిన్మెంట్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');