ఇన్ఫో ఎడ్జ్‌కు కొనుగోళ్ళ మద్దతు

ఇన్ఫో ఎడ్జ్‌కు కొనుగోళ్ళ మద్దతు

ఉబెర్‌ ఈట్స్‌కు చెందిన ఇండియా వ్యాపారాన్ని జొమాటో కొనుగోలు చేయడంతో ఇవాళ ఇంట్రాడేలో ఇన్ఫో ఎడ్జ్‌ 3శాతం పైగా లాభపడింది. ఇంట్రాడేలో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా మూడున్నర శాతం లాభపడి రూ.2676కు పెరిగింది. ప్రస్తుతం భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఉబెర్‌ ఈట్స్‌ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలోని 41 నగరాల్లో ఈ కంపెనీ సేవలందిస్తోంది. తాజా టేకోవర్‌తో ఉబర్‌ ఈట్స్‌ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు మాత్రమే పరిమితం కానుంది. ఈ ఒప్పందం విలువ 300-350 మిలియన్‌ డాలర్లు. 

జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు వాటా ఉంది. ఈ లావాదేవీ తర్వాత జొమాటోలో తమ వాటా 22.71శాతానికి తగ్గనుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోఎడ్జ్‌ తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోలో ఉబెర్‌కు 9.9శాతం వాటా లభించనుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫో ఎడ్జ్‌ ఔట్‌పెర్ఫామ్‌ చేసింది. షేర్‌ విలువ ఈ ఆర్థిక సంవత్సరంలో 41శాతం పెరిగింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');