ఫ్లాట్‌గా మార్కెట్లు.. మెటల్, ఐటీ షేర్ల పరుగులు

ఫ్లాట్‌గా మార్కెట్లు.. మెటల్, ఐటీ షేర్ల పరుగులు

స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నిన్నటి ఆల్‌టైం రికార్డులను కొనసాగిస్తూ.. ఇవాళ కూడా మార్కెట్లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసినా... హైయర్ లెవెల్స్‌లో సూచీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. 

అధిక స్థాయిల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతుండడంతో... సెన్సెక్స్, నిఫ్టీలు నిరోధం ఎదుర్కుంటున్నాయి. అయితే ఇన్ఫోసిస్ అందించిన చక్కని ఫలితాలు... విప్రో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయవచ్చనే అంచనాలతో ఐటీ, టెక్నాలజీ కౌంటర్లకు మాత్రం చక్కని కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.

బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగిలిన అన్ని సెక్టార్లు లాభాల్లోనే ఉండగా.. మెటల్స్ సెక్టార్ 1.4 శాతం మేర లాభపడింది. ఐటీ, టెక్నాలజీ రంగాలు 0.8 శాతం మేర ఊపందుకున్నాయి.

ప్రస్తుతం నిఫ్టీలో వేదాంత, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా... యస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.