యస్ బ్యాంక్ మళ్లీ 5 శాతం డౌన్

యస్ బ్యాంక్ మళ్లీ 5 శాతం డౌన్

యస్ బ్యాంక్ కౌంటర్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సెషన్‌లుగా యస్ బ్యాంక్ షేర్ భారీగా నష్టపోతుండగా.. తాజాగా ఈ ప్రైవేట్ బ్యాంకుకు "సెల్" రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. 

సెల్ రేటింగ్ కొనసాగించడంతో పాటు.. ఈ షేర్ టార్గెట్ ధరను రూ. 55 నుంచి రూ. 40కి తగ్గిస్తున్నట్లు కోటక్ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే యస్ బ్యాంక్ షేర్ ధర భారీగా పతనం అయింది.

ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేర్ ధర 4.75 శాతం నష్టంతో రూ. 40.10 వద్ద ట్రేడవుతోంది. 

యస్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉత్తమ్ ప్రకాష్ రాజీనామా చేయడం కూడా ఈ కౌంటర్‌లో భారీ విక్రయాలకు కారణంగా తెలుస్తోంది.