సిమెంట్‌ షేర్లలో ర్యాలీ.. ఎందుకంటే?

సిమెంట్‌ షేర్లలో ర్యాలీ.. ఎందుకంటే?

వరుసగా ఐదోరోజూ సిమెంట్‌ షేర్లు ర్యాలీని కొనసాగించాయి. డిమాండ్‌ భారీగా పెరుగుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు సిమెంట్‌ స్టాక్స్‌ కొనుగోళ్ళపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత లెవెల్స్‌లో ఈ రంగానికి రిస్క్‌/రివార్డ్‌ అనుకూలంగా ఉందని మార్కెట్‌ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

గత వారం రోజులుగా శ్రీ సిమెంట్‌, రాంకో సిమెంట్‌, బిర్లా కార్పొరేషన్‌, ఓరియంట్‌ సిమెంట్‌లు 10శాతం పైగా ర్యాలీ చేశాయి. అలాగే గత వారం రోజులుగా అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, జేకే లక్ష్మీ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, స్టార్‌ సిమెంట్‌, హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌లు 5-9 శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో S&P BSE సెన్సెక్స్‌ 3శాతం లాభపడింది. 

"కాలానుగుణంగా సిమెంట్‌కు డిమాండ్‌ ఉంటుంది. గత నెల్లో సిమెంట్‌ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. వచ్చే బడ్జెట్లో ఇన్‌ఫ్రా, రియాల్టీ రంగాలకు లాభించే నిర్ణయాలు వెలువడవచ్చని వార్తలు రావడంతో సిమెంట్ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. జనవరి/ఫిబ్రవరిల్లో విడుదల కానున్న బలహీనమైన క్యూ-3 ఆదాయాలు మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. అయితే పెరగనున్న డిమాండ్‌, సిమెంట్‌ ధరల పెంపులు ఆయా స్టాక్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలు. ప్రస్తుతం ఈ రంగానికి రిస్క్‌/రివార్డ్‌ అనుకూలంగా ఉంది." అని ఫారిన్‌ బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది. 

FY21/22లో ఇండస్ట్రీ డిమాండ్‌ వృద్ధి 5-6శాతంగా నమోదు కావచ్చని జేపీ మోర్గాన్‌ ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే రాబోయే రోజుల్లో సిమెంట్‌ స్టాక్స్‌లో వృద్ధి కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. 

గత వారం రోజులుగా సిమెంట్‌ స్టాక్స్‌ పెర్ఫామెన్స్‌ దిగువ పట్టికలో చూడండి.

కంపెనీ సీఎంపీ వారం రోజుల ముందు లాభం(%)
బిర్లా కార్పొరేషన్ 696.2 603.4 15.4
ఓరియంట్ సిమెంట్ 84.5 75 12.7
శ్రీ సిమెంట్ 23462 21089.7 11.3
రామ్ కో సిమెంట్ 829.65 750.95 10.5
ఇండియా సిమెంట్స్ 80.2 72.9 10
జేకే లక్ష్మీ సిమెంట్ 333.05 303.2 9.8
స్టార్ సిమెంట్ 96.75 88.4 9.5
సంఘ్వి ఇండస్ట్రీస్ 42.4 38.95 8.9
NCL ఇండస్ట్రీస్ 95.5 87.8 8.8
అల్ట్రాటెక్ సిమెంట్ 4472.2 4152.85 7.7
అంబుజా సిమెంట్ 211.75 196.85 7.6
హెడెల్ బర్గ్ సిమెంట్ 192.9 179.6 7.4
ఏసీసీ 1526 1436.75 6.2