రికార్డు స్థాయి గరిష్టం వద్ద ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

రికార్డు స్థాయి గరిష్టం వద్ద ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లో బుల్‌ జోరు కొనసాగుతోంది. ఇవాళ రికార్డ్‌ స్థాయి గరిష్టం వద్ద సూచీలు క్లోజయ్యాయి. ఐటీ, మెటల్‌, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు అరశాతం పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో 41860 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 12330 వద్ద ముగిశాయి. సైకలాజికల్‌ లెవల్‌ 12345కు నిఫ్టీ మరో 15 పాయింట్ల దూరంలో నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12337.75 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని టచ్‌ చేసింది. 

Nifty Bank
32198.50    101.10    +0.31%

Nifty IT
16233.50    273.60    +1.71%

BSE SmallCap
14282.09    134.45    +0.95%

BSE MidCap
15290.11    131.19    +0.87%

Nifty Auto
8237.65    12.15    +0.15%

BSE Cap Goods
17366.50    112.51    +0.65%

BSE Cons Durable
25081.47    222.39    +0.89%

BSE FMCG
11652.59    138.88    +1.21%

BSE Healthcare
13635.53    56.43    +0.42%

BSE Metals
10669.09    119.01    +1.13%

BSE Oil & Gas
14719.46    98.74    +0.68%

BSE Teck
7956.91    141.15    +1.81%

Nifty PSE
3252.95    45.65    +1.42%


ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యెస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ 4.65శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.67శాతం, కోల్‌ ఇండియా 3.07శాతం, గెయిల్‌ 2.91శాతం, భారతి ఎయిర్‌టెల్‌ 2.54శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్‌ బ్యాంక్‌ 5.92శాతం, యూపీఎల్‌ 1.18శాతం, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ 1.18శాతం, టీసీఎస్‌ 0.93శాతం, ఐషర్‌ మోటార్స్‌ 0.67శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');