అంచనాలను మించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆర్థిక ఫలితాలు

అంచనాలను మించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆర్థిక ఫలితాలు

డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. స్టాండలోన్‌ నికరలాభం 53.3శాతం వృద్ధితో రూ.394 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24శాతం వృధ్ధితో రూ.6752 కోట్లకు చేరాయి. మూడో త్రైమాసికంలో కొత్తగా 7 స్టోర్లను ఏర్పాటు చేసినట్లు, డిసెంబర్‌ 31, 2019 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 196కు చేరిందని కంపెనీ వెల్లడించింది. క్యూ-3లో ఫెస్టివల్‌ సీజన్‌తో అమ్మకాలు గతంతో పోలిస్తే ఎంతో మెరుగయ్యాయని, దీంతో నాల్గో త్రైమాసికం తమకు సవాలుగా మారిందని, దీనిలోనూ తాము సక్సెస్‌ అవుతామని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తెలిపింది. 

ఇక స్టాక్‌ మార్కెట్లో అవెన్యూ సూపర్ మార్ట్స్‌ జోరుమీదుంది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 3శాతం పైగా లాభపడి రూ.1941కిచేరింది. గత ఏడాది నవంబర్‌ 8న ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.2010ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఒకటిన్నర శాతం లాభంతో రూ.1903 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.