యెస్‌ బ్యాంక్‌ నేలచూపులు

యెస్‌ బ్యాంక్‌ నేలచూపులు

వరుసగా రెండో రోజూ యెస్‌ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. కంపెనీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ రాజీనామా చేయడంతో యెస్‌ బ్యాంక్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ 8శాతం పైగా నష్టపోయి రూ.41.05కు పడిపోయింది. ప్రస్తుతం ఆరున్నర శాతం నష్టంతో రూ.41.95 వద్ద కొనసాగుతోంది. ఉదయం 11:45 వరకు బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 12 కోట్ల  షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,954.28 కోట్లకు తగ్గింది. రూ.25 టార్గెట్‌తో అండర్‌వెయిట్‌ కాల్‌గా యెస్‌బ్యాంక్‌ను కొనసాగిస్తున్నట్టు మోర్గాన్‌ స్టాన్లే వెల్లడించింది. 

ప్రైవేట్‌ రంగ రుణదాతగా దిగజారుతోన్న పద్ధతులపై ఆందోళన చెందిన యెస్‌ బ్యాంక్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరో డైరెక్టర్‌ను నియమించేందుకు యెస్‌బ్యాంక్‌ కసరత్తు ప్రారంభించింది. మరోవైపు డెట్‌, ఈక్విటీల ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సేకరించడానికి ఈనెల 10న జరిగిన సమావేశంలో యెస్‌ బ్యాంక్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఎర్విన్‌ సింగ్‌ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రతిపాదిత ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్‌తో కొనసాగకూడదని బోర్డు నిర్ణయించింది. తర్వాత సమావేశంలో సిటాక్స్‌ ఇన్వెస్ట్‌ గ్రూప్‌ $500 మిలియన్ల ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు భావిస్తోంది.