రుణభారం తగ్గింపుతో హెచ్‌సీసీ 9 శాతం అప్

రుణభారం తగ్గింపుతో హెచ్‌సీసీ 9 శాతం అప్

హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్ ఇవాళ భారీ ర్యాలీ చేస్తోంది. రూ. 2100 కోట్ల రుణాన్ని థర్డ్ పార్టీ నియంత్రించే ఎస్‌పీవీకి బదలాయించేందుకు రుణదాతలు అంగీకరించడంతో.. ఇవాల్టి ట్రేడింగ్‌లో హెచ్‌సీసీ కౌంటర్‌లో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. 

ఇవాళ ఒక్క రోజే 9 శాతం పైగా లాభపడగా.. ప్రస్తుతం 7.26 శాతం లాభంతో రూ. 1.08 వద్ద హెచ్‌సీసీ ట్రేడవుతోంది.

గత మూడు నెలల కాలంలో ఈ స్టాక్ 38 శాతం మేర ర్యాలీ చేయడం గమనించాలి.