నిఫ్టీ మరోసారి ఆల్‌టైం రికార్డ్

నిఫ్టీ మరోసారి ఆల్‌టైం రికార్డ్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్ఫోసిస్ రిజల్ట్స్.. నవంబర్ ఐఐపీ డేటా వంటి పాజిటివ్ సెంటిమెంట్స్‌తో ఇవాళ మన మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

ట్రేడిగ్ ఆరంభం నుంచి సూచీలు లాభాల్లోనే ఉండగా.. నిఫ్టీ ఆల్‌టైం రికార్డ్‌ను చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంతో 41812 వద్ద ఉండగా.. నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధి చెంది 12312 వద్ద ట్రేడవుతోంది.

ఆటోమొబైల్ మినహా మిగిలిన అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇన్ఫోసిస్ చక్కని లాభాలు గడిస్తుండడంతో.. ఆ రంగంలోని షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల ప్రభావంతోఐటీ, టెక్నాలజీ సూచీలు దాదాపు ఒకటిన్నర శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.

 

 

ప్రస్తుతం నిఫ్టీలో ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, విప్రో, సిప్లా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. యస్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, యూపీఎల్‌ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.