ASOCSలో వాటా కొనుగోలు చేసిన స్టెర్‌లైట్‌

ASOCSలో వాటా కొనుగోలు చేసిన స్టెర్‌లైట్‌

ఇజ్రాయిల్‌కు చెందిన ASOCSలో కొంత వాటాను తమ అనుబంధ సంస్థ స్టెర్‌లైట్‌ గ్లోబల్‌ వెంచర్‌(మారిషస్‌) కొనుగోలు చేసినట్లు స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. అవుట్‌ స్టాండింగ్‌ పద్ధతి, కొత్త షేర్ల జారీ పద్ధతిలో 12.8 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి ASOCSతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. 

"ASOCSలో ఇన్వెస్ట్‌ చేస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఎస్టీఎల్‌, ASOCSలను కన్వర్జ్‌ నెట్‌వర్క్‌( వైర్‌లెస్‌, వైర్‌లైన్‌ నెట్‌వర్క్‌లు కలిపి) ఎండ్‌-టు ఎండ్‌  సామర్థ్యాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సహాయపడుతుందని నమ్ముతున్నాము." అని స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ సీఈఓ డాక్టర్‌ ఆనంద్‌ అగర్వాల్‌ తెలిపారు. 

ASOCSలో వాటా కొనుగోలు చేయడంతో ఇవాళ స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ జోరుమీదుంది. ఇంట్రాడేలో దాదాపు 5 శాతం లాభపడి రూ.129.90కి చేరింది. ప్రస్తుతం 3శాతం లాభంతో 127.75 వద్ద కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి మొత్తం 13లక్షల షేర్లు ట్రేడయ్యాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5,157.55 కోట్లకు పెరిగింది. ఇండస్ట్రీ పీ/ఈ 9.15గా ఉండగా, కంపెనీ పీ/ఈ 8.31గా ఉంది. బుక్‌ వాల్యూ రూ.39.33 కాగా, ఈపీఎస్‌ 15.36గా నమోదైంది.