స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జనవరి 10)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జనవరి 10)
 • అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో మెజార్టీ వాటా కొనుగోలును పూర్తి చేసిన హెచ్‌డీఎఫ్‌సీ, విలువ రూ.1495.81 కోట్లు
 • ఇజ్రాయిల్‌కు చెందిన ASOCSలో 12.8 శాతం వాటా కొనుగోలు చేసిన స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ
 • హాంగ్‌కాంగ్‌కు చెందిన ESR కేమ్యాన్‌తో జేవీ కుదుర్చుకున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
 • హైదరాబాద్‌ విమానాశ్రయంలో రూ.550 కోట్లతో 66 ఎకరాల్లో పెద్ద లాజిస్టిక్స్‌, పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
 • టాటా సన్స్‌, సింగపూరియన్‌ వెల్త్‌ ఫండ్‌ నుంచి రూ.2వేల కోట్ల రుణాన్ని సేకరించిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా
 • క్యూఐపీ ఇష్యూ ధర నిర్ణయంపై ఈనెల 14న సమావేశం కానున్న భారతి ఎయిర్‌టెల్‌
 • నేపాల్‌లో కాసినో ఏర్పాటు చేసేందుకు లైసెన్స్‌ పొందిన డెల్టాకార్ప్‌ అనుబంధ సంస్థ
 • రూ.529.27 కోట్లకు వలయార్‌ టోల్‌ యూనిట్‌ను క్యూబ్‌ హైవేస్‌కు విక్రయించనున్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
 • ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ కొత్త అడిషనల్‌ డైరెక్టర్‌గా హిరోయుకి తనకా నియామకం
 • డిజిటల్‌ సొల్యూషన్స్‌ కోసం నార్వేకు చెందిన విప్ప్స్‌తో భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించిన టీసీఎస్‌
 • ఎంసీఎల్‌ఆర్‌ రేటును తగ్గించిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌
 • బాండ్స్‌ ద్వారా నిధులను సేకరించేందుకు ఈనెల 16న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌
 • ఇవాళ్టి నుంచి ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న క్యాపిటల్ ట్రస్ట్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న 3ఐ ఇన్ఫోటెక్‌, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న అక్షర్‌ కెమ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, ఎంఎస్‌పీ స్టీల్‌ & పవర్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌
 • కాకతీయ సిమెంట్‌ సుగర్‌ & ఇండస్ట్రీస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు


tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');