ఎస్‌బీఐతో సన్‌టెక్‌ ఒప్పందం

ఎస్‌బీఐతో సన్‌టెక్‌ ఒప్పందం

దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు సన్‌టెక్‌ రియాల్టీ ప్రకటించింది. బ్యాంక్‌ నిర్దేశించిన ప్రమాణాలను కలిగివున్న బిల్డర్లందరికీ రూ.50 కోట్ల నుంచి రూ.400 కోట్ల మధ్య రుణం పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. 3 కొత్త ప్రాజెక్ట్‌లకు కావాల్సిన నిధుల కోసం ఈ ఒప్పందం కుదుర్చకున్నామని, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు సన్‌టెక్‌ రియాల్టీ తెలిపింది. 

"ఎస్‌బీఐ, సన్‌టెక్‌ రియాల్టీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. "సప్నా ఆప్కా - భరోసా ఎస్‌బీఐ కా" స్కీమ్‌ కింద నివాస గృహ రంగానికి బూస్టింగ్‌నిచ్చేలా ఇది తొలి అడుగు." అని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో సన్‌టెక్‌ రియాల్టీ తెలిపింది. 

"ఈ ప్రెస్టిజియస్‌ ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌కు మొదటి భాగస్వామిగా వినయంగా ఉన్నాం. ఈ అవగాహన ఒప్పందం, మా కస్టమర్లకు ఉత్తమ విలువ, ఉత్తమ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన గృహాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది" అని సన్‌టెక్‌ రియాల్టీ సీఎండీ కమల్‌ ఖేతన్‌ తెలిపారు. 

ఈ ఒప్పందం ద్వారా ఎస్‌బీఐ నుంచి గృహ రుణాలు పొందే వినియోగదారులకు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హామీ ఇవ్వడం ద్వారా బిల్డర్స్‌ను ఆర్థికంగా కాపాడటానికి రెసిడెన్షియల్‌ బిల్డర్స్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్స్‌ గ్యారెంటీ(RBBG)ను ప్రకటించింది. 

షేర్‌ జోరు..
3 ప్రాజెక్టుల కోసం ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇవాళ సన్‌టెక్‌ రియాల్టీ షేర్‌ జోరుమీదుంది. ఇంట్రాడేలో 6శాతం పైగా లాభపడి రూ.450 గరిష్టానికి చేరింది. ప్రస్తుతం 5శాతం లాభంతో రూ.445 సమీపంలో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12గంటల సమయానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి మొత్తం 1.20 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6,463.32 కోట్లకు పెరిగింది. అలాగే పీ/ఈ 50.22గా నమోదైంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ 13శాతం వరకు లాభపడింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');