2020లో ఈ మిడ్‌క్యాప్స్‌ స్టాక్స్ బాగా పెరగొచ్చు!

2020లో ఈ మిడ్‌క్యాప్స్‌ స్టాక్స్ బాగా పెరగొచ్చు!

2019లో మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే ఈ ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేశాయి. మిడ్‌క్యాప్ రంగం మాత్రం కొన్ని వారాలుగా మాత్రమే కొనుగోళ్ల బాట పట్టింది. అనేక మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ సమయంలో ప్రతికూల ఫలితాలను అందించాయి.

2019లో సెన్సెక్స్ 14.38 శాతం ర్యాలీ చేయగా.. నిఫ్టీ 12 శాతం పెరిగింది. కానీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్‌లు మాత్రం నెగిటివ్‌గానే ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ గతేడాది 3 శాతం క్షీణించగా.. స్మాల్‌క్యాప్ సూచీ అయితే 7 శాతం మేర పతనం అయింది.

కానీ 2020లో మాత్రం పరిస్థితులు మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ అని కాకుండా.. ఆయా కంపెనీలను ఇండివిడ్యువల్‌గా పరిశీలించాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు

ఎంపిక చేసిన కొన్ని  స్టాక్స్‌ 2020లో భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఆర్థిక రంగం రికవరీ అవుతుండడం, అలాగే పబ్లిక్ - ప్రైవేట్ సెక్టార్లలో స్పెండింగ్ పెరగడాన్ని వీరు చెబుతున్నారు.

2020లో మంచి లాభాలను గడించవచ్చని చెబుతూ.. మిడ్‌క్యాప్ సెక్టార్‌లో ఆయా బ్రోకరేజ్ సంస్థలు ఎంపిక చేసిన 27 స్టాక్స్ జాబితాను ఇక్కడ మీకు అందిస్తున్నాం :