ఇరాక్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇరాక్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇరాక్‌కు అమెరికా ప్రెసిడెంట్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా బలగాలను తమ దేశం నుంచి పంపేయాలని ఇరాక్‌ పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకవేళ అదే జరిగితే ఇరాక్‌పై "అతి భారీ ఆంక్షలు" తప్పవని ఆయన ఘాటుగా హెచ్చరించారు. 

అమెరికా సైన్యాన్ని తమ భూభాగం నుంచి పంపేయాలని ఇరాక్‌ పార్లమెంటు ఆదివారం నిర్ణయించింది. ఆ దేశ సైన్యాన్ని మోహరించేందుకు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తీర్మానం చేసింది. ఈ నిర్ణయంతో అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ఫైర్‌ అయ్యారు. పరిస్థితి మారకుంటే ఇరాక్‌ తీవ్ర ఇబ్బందులు పడనుందని ఆయన చెప్పారు. అలాగే జనరల్‌ సులేమానీని చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్‌ ఎలాంటి దాడికి సిద్ధపడినా.. అమెరికా నుంచి భారీ ప్రతిదాడి ఉంటుందని ట్రంప్‌ తెలిపారు. 

మరోవైపు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ట్రంప్‌ వరుస హెచ్చరికలు, అలాగే ఇరాన్‌ ప్రతిస్పందన... ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంధి. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో ప్రపంచాధినేతలు సంయమనం పాటించాలని ఇరు దేశాలను కోరారు.

డెమోక్రాట్లపై మండిపాటు..
దేశాభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తుంటానని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దానిని అధిగమిస్తామని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.  ఇరాన్‌పై ఏకపక్షంగా ముందుకు వెళుతున్నారని ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి విమర్శలు రావడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ విషయంలో మీడియాలో తాను చేసే ప్రకటనలే కాంగ్రెస్ నోటిఫికేషన్‌గా భావించాలని ఆయన వెల్లడించారు. ఇరాన్‌ దాడికి పాల్పడితే అమెరికా సైతం తీవ్ర స్థాయిలో తిప్పికొడుతుందని.. దీనికి ఎలాంటి చట్టపరమైన నోటీసులు అవసరం లేదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');