ఈ వారం ఏం జరిగిందంటే?

ఈ వారం ఏం జరిగిందంటే?

సెన్సెక్స్ నిఫ్టీలు వరుసగా రెండో వారం కూడా నష్టాలతో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం 45 పైసల మేర క్షీణించింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.26 శాతం లాభపడగా.. మిడ్‌క్యాప్ సూచీ 1.24 శాతం పెరిగింది,

అంతర్జాతీయ పరిణామాల కారణంగా జనవరి3తో ముగిసిన వారాంతంలో భారతీయ ప్రధాన స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అమెరికా చేసిన ఎయిర్‌స్టైక్‌లో ఇరానియన్ మిలిటరీ జనరల్ మరణించడం జియో పొలిటికల్ టెన్షన్స్‌ను పెంచింది.
మరోవైపు ఒకే సెషన్‌లో క్రూడాయిల్ ధరలు 4 శాతం పెరగగగా.. మిడిల్-ఈస్ట్ టెన్షన్స్ కారణంగా బంగారం ధరలు 4 నెలల గరిష్టానికి చేరుకున్నాయి.

ఇక యూఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే చైనా తాజాగా ఆర్థిక స్టిమ్యులస్ ప్యాకేజీ కారణంగా.. అమెరికా సూచీలు ఆల్‌టైం రికార్డ్ గరిష్టాలను పెంచాయి. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ టెన్షన్స్ కూడా కొంతమేర కుదుటపడ్డాయనే చెప్పాలి.

మన మార్కెట్ల విషయానికి వస్తే, రికార్డు గరిష్ట స్థాయికి కొంచెం దూరంలో నిఫ్టీ ఆగిపోయింది.
గత వారంలో సెన్సెక్స్ 110 పాయింట్లను కోల్పోయి 41,464 వద్ద ముగియగా.. 19 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 12,226 వద్ద క్లోజయింది. ప్రొవిజనల్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత మదుపరులు రూ. 497.32 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 29.61 కోట్ల షేర్లను కొన్నారు.

బీఎస్ఈ మిడ్‌క్యాప్
గెయినర్స్
పీఎన్‌బీ హౌసింగ్, స్టెరిలైట్ టెక్నాలజీస్, అదాని గ్యాస్, ఫినొలెక్స్ కేబుల్స్, క్వెస్‌కార్ప్
లూజర్స్
థామస్ కుక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, డిష్ టీవీ, కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంక్

బీఎస్ఈ స్మాల్ క్యాప్
గెయినర్స్
సొరిల్ ఇన్‌ఫ్రా రీసోర్సెస్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, సుజ్లాన్ ఎనర్జీ, శార్దా క్రాప్‌కెమ్, దాల్మియా భారత్ షుగర్
లూజర్స్
డిష్‌మ్యాన్ కార్పోజెన్, జేపీ ఇన్‌ఫ్రాటెక్, రిలయన్స నావల్, రాణే మద్రాస్, థామస్ కుక్

బీఎస్ఈ లార్జ్‌క్యాప్
గెయినర్స్
ఐబీ హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా మోటార్స్-డీవీఆర్, గెయిల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
లూజర్స్
జీ ఎంటర్టెయిన్మెంట్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీ

సెన్సెక్స్ వీక్లీ మార్కెట్‌క్యాప్
గెయినర్స్
ఎల్ &టీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా
లూజర్స్
ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో

ఎన్ఎస్ఈ సెక్టార్ పెర్ఫామెన్స్
నిఫ్టీ మీడియా(-3.03%)
నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ (-1.72%)
నిఫ్టీ మెటల్ (+3.19%)
నిఫ్టీ రియాల్టీ (+1.2%)
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');