ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీంకోర్టుకు టాటాసన్స్‌

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీంకోర్టుకు టాటాసన్స్‌

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటాసన్స్‌. గత నెల 18న సైరస్‌ మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటాసన్స్‌ సుప్రీకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం (ఈనెల 6న) సుప్రీంకోర్టు విచారణ చేపట్టే ఛాన్స్‌ ఉంది. ఈనెల 9న  టీసీఎస్‌ బోర్డు మీటింగ్‌ జరగనుండటంతో సత్వర ఉపశమనం కోసం సుప్రీం కోర్టును టాటాసన్స్‌ ఆశ్రయించింది. 

టాటాసన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా, టీసీఎస్‌, టాటా ఇండస్ట్రీస్‌, టాటా టెలిసర్వీస్‌లకు డైరెక్టర్‌గా సైరస్‌ మిస్త్రీని నియమించాలని గత నెల 18న ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు చెప్పింది. దీంతో దాదాపు మూడేళ్ళ తర్వాత సైరస్‌మిస్త్రీ మళ్ళీ ఆ పదవులను చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమని ఎన్‌సీఎల్‌ఏటీ తెలిపింది. 

మూడేళ్ళ క్రితం అంటే 2016 అక్టోబరు 24న సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా సన్స్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్పొరేట్‌ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపించిన సైరస్‌ మిస్త్రీ కోర్టులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్‌ 19న టాటా గ్రూప్‌లోని అన్ని సంస్థల డైరెక్టర్‌ పదవికీ ఆయన రాజీనామా చేసీ న్యాయపోరాటం చేస్తున్నారు. అదే నెల 20న ఎన్‌సీఎల్‌ఏటీని సైరస్‌ మిస్త్రీ ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌ఏటీ సైరస్‌ మిస్త్రీ తొలగింపు చట్టవిరుద్ధమని తెలిపింది. వెంటనే ఆయనకు తిరిగి పాత బాధ్యతలు అప్పగించాలని తీర్పు చెప్పింది. మిస్త్రీ పునర్నియామక ఉత్తర్వులు 4 వారాల తర్వాత అమల్లోకి రాబోతున్నాయి. ఈలోపు ఉన్నత న్యాయస్థానంలో తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతినిచ్చింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');