వచ్చేనెల నుంచి అమల్లోకి  ట్రాయ్‌ కొత్త నిబంధనలు

వచ్చేనెల నుంచి అమల్లోకి  ట్రాయ్‌ కొత్త నిబంధనలు

టారిఫ్‌ ఫ్రేమ్‌వర్క్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నియమ నిబంధనలను నిర్దేశించింది. ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబర్స్‌కు సమూహంగా(అన్నీ ఒక్కసారే) విక్రయించినప్పుడు బ్రాడ్‌కాస్టర్స్‌ అందించే భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ సమస్యను పరిష్కరించడానికి కొన్ని నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్టు ట్రాయ్‌ తెలిపింది. కొత్త నియమ నిబంధనలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. సబ్‌స్క్రైబర్స్‌కు పెరుగుతున్న ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా డిస్ట్రిబ్యూటర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్స్‌ను రూ.160కు అందించాలని పరిమితి విధించింది. 

ట్రాయ్‌ కొత్త నిర్ణయంతో ఇవాళ దేశీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సన్‌టీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 2-4శాతం నష్టపోయాయి. గత ఏడాది కాలం నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉన్న సన్‌టీవీ 30 శాతం పైగా నష్టపోయింది. ప్రస్తుతం  ఈ స్టాక్‌ 4శాతం పైగా నష్టంతో రూ.421 సమీపంలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సన్‌టీవీ రూ.430.80 గరిష్టం, రూ.411.45 కనిష్ట స్థాయిలను తాకింది. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం పైగా ఈ షేర్ నష్టోయింది. గత ఏడాది కాలం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గత ఏడాది కాలంలో 41శాతం పైగా నష్టపోయింది. మరోవైపు మార్కెట్‌ ఎనలిస్టులు కూడా సన్‌టీవీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. టెక్నికల్‌ ఎనలిస్ట్‌ మితేశ్‌ థక్కర్‌ సన్‌టీవీకి "SELL" చేయమని సిఫారసు చేస్తున్నారు. రూ.446.5 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ టార్గెట్‌ ధర రూ.431 అని ఆయన అంచనా వేస్తున్నారు.