లిస్టింగ్‌లో డిజప్పాయింట్ చేసిన ప్రిన్స్ పైప్స్ 

లిస్టింగ్‌లో డిజప్పాయింట్ చేసిన ప్రిన్స్ పైప్స్ 


పాలిమర్ పైప్స్ మరియు ఫిటింగ్స్‌ను తయారు చేసే కంపెనీ ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిటింగ్స్.. ఇవాళ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది. తాజాగా రూ. 500 కోట్ల ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీకి... సబ్‌స్క్రిప్షన్‌లో మంచి స్పందన లభించింది. అయితే, లిస్టింగ్ మాత్రం ప్రిన్స్ పైప్స్ నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.

ఇష్యూ ధరతో పోల్చితే 10 శాతం డిస్కౌంట్ వద్ద ప్రిన్స్ పైప్స్ లిస్ట్ అయింది. ఎన్‌ఎస్ఈలో రూ. 160 వద్ద ట్రేడింగ్ ప్రారంభించుకోగా.. ఇష్యూ ధర రూ. 178గా ఉంది.

 


ట్రేడింగ్ ఆరంభం తర్వాత కొంతమేర స్టాక్ కోలుకుంది. ప్రస్తుతం ఇష్యూ ధరతో పోల్చితే 2 శాతం నష్టంతో రూ. 174 వద్ద ట్రేడవుతోంది.

ప్రిన్స్ పైప్స్ సబ్‌స్క్రిప్షన్ ఆకట్టుకునే స్థాయిలోనే ఉన్నా.. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగానే.. లిస్టింగ్‌లో ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.