రూ.700 కోట్ల ఐపీఓకు రోజరీ బయోటెక్

రూ.700 కోట్ల ఐపీఓకు రోజరీ బయోటెక్

కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన రోజరీ బయోటెక్ ఐపీఓకు రాబోతోంది. ప్రైమరీ మార్కెట్ ద్వారా సుమారు రూ.700 కోట్లు సమీకరించేందుకు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.

ఈ రూ.700 కోట్ల ఐపీఓలో ముఖ్యంగా రూ.150 కోట్ల ఫ్రెష్ ఇష్యూతో పాటు ప్రమోటర్ల 1.05 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ షేర్స్ కూడా ఉండబోతున్నాయి.

ప్లేస్‌మెంట్ ఎలా
ఐపీఓలో భాగంగా సుమారు రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా సమీకరించేందుకు సంస్థ సమాయత్తమవుతున్నట్టు ప్రాస్పెక్టస్ చూస్తే అర్థమవుతోంది. ఒక వేళ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ లభిస్తే.. ఐపీఓ సైజ్ కాస్త తగ్గుతుంది.

నిధులను ఏం చేస్తారు
సమీకరించిన నిధులను విస్తరణతో పాటు రుణాలను తీర్చేందుకు వినియోగించబోతోంది రోజరీ బయోటెక్. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించబోతున్నారు.

ఎఫ్ఎంసిజి, అపెరల్, పౌల్ట్రీ, జంతు సంబంధ ఆహార పరిశ్రమలకు ప్రత్యేకమైన కస్టమైజ్డ్ సొల్యూషన్స్ సహా ప్రొడక్షన్ అవసరాలకు అనుగుణమైన సేవలను రోజరీ బయోటెక్ అందిస్తుంది.

ఈ కేటగిరీలో ఉన్న ఇతర కంపెనీలు

ఇక కెమికల్ ప్రోడక్ట్ క్యాటగిరీలో ప్రముఖ టెక్స్ టైల్ సంస్థలైన అర్వింద్, రేమండ్స్, అస్నూర్ టెక్స్, భాస్కర్ ఇండస్ట్రీస్, యూరోపియన్ టెక్స్ టైల్ కెమికల్, షాహీ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలున్నాయి.

ఇండియాతో పాటు వియత్నాం, బంగ్లాదేశ్, మారిషస్ వంటి 17 ఇతర దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.