బయ్ ఆన్ డిప్స్.. మార్కెట్లో సడన్ బుల్లిష్ ట్రెండ్

బయ్ ఆన్ డిప్స్.. మార్కెట్లో సడన్ బుల్లిష్ ట్రెండ్


గత వారం మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇండెక్స్ కాస్త స్థిరంగా కనిపించినప్పటికీ చాలా స్టాక్స్ మాత్రం నీరసంగా ఉన్నాయి. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి లిక్విడిటీ రావడం ఇండెక్స్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా నెగిటివ్ న్యూస్ ఏదీ రాకపోవడం కూడా పెద్దగా ఇబ్బందులు పెట్టలేదు.

ట్రంప్ గుడ్ న్యూస్
ఈ ఏడాది ఆఖర్లోనే అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసి సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావించారు. అయితే ఇది ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఈ లోపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ చిన్నపాటి గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి దశ డీల్‌ దాదాపుగా ఓకె అయినట్టు ట్వీట్ చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కొలిక్కి వస్తోందనే ఆశాభావం స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఐపీఓ సీజన్
సెకెండరీ మార్కెట్ సంగతి పక్కనబెడితే రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ ఐపీఓల కోసం వెంటబడ్తున్నారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం జనాలు క్యూ కట్టారు. ఇండియన్ మార్కెట్లో మళ్లీ కొత్త ఐపీఓల కోసం జోరు మొదలైందని అర్థమవుతోంది.

 

ప్రభుత్వ చర్యలు
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. వృద్ధి రేటును మళ్లీ పట్టాలెక్కించి గాడిలో పెట్టేందుకు తనవంతు ప్రయత్నాలను చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఐబీసీ కోడ్‌లో మార్పులు వంటివి ఇందుకు ఉదాహరణలు.

 

టెక్నికల్ ఔట్‌లుక్
నిఫ్టీ 50 బుల్లిష్‌గా కనిపిస్తోంది. 12100 పాయింట్ల దిశగా పరుగులు తీస్తోంది. నిఫ్టీ గత మూడు నాలుగు వారాల్లో డబుల్ బాటం ఫార్మేషన్ కనిపిస్తోంది. మీడియం టర్మ్‌లో మార్కెట్ బుల్లిష్ అనేందుకు ఇదో సంకేతం. వీక్లీ ఛార్ట్స్‌లో హ్యామర్ ఫార్మేషన్ ఉంది. ఇది కూడా పాజిటివ్. అయితే 12150 దగ్గర కొద్దిగా లాభాల స్వీకరణకు ఆస్కారం ఉంది. ట్రేడర్లు పడినప్పుడు కొని, వీక్లీ కనిష్టాలను స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి.

 

వచ్చే వారం..
యూకె ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ అఖండమైన మెజార్టీతో విజయం సాధించారు. జనవరి 31 లోపు బ్రెక్సిట్ పూర్తి కానున్న నేపధ్యంలో మార్కెట్లు ఈ అంశాన్ని కీలకంగా పరిశీలిస్తాయి. ఇక యూరోప్‌తో వ్యాపార సంబంధాలున్న అనేక కంపెనీల గురించి ఇంతకాలం ఉన్న ఆందోళనకు తెరపడినట్టే చెప్పొచ్చు.

ఇక దేశీయంగా వచ్చే వారం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. కొన్ని వస్తువులు, సేవలపై పన్నుల్లో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


- జమీత్ మోదీ, సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ