షార్ట్ టర్మ్‌లో ఆ 2 స్టాక్స్ 20 శాతం లాభాలను అందించొచ్చు

షార్ట్ టర్మ్‌లో ఆ 2 స్టాక్స్ 20 శాతం లాభాలను అందించొచ్చు

వచ్చే ఏడాది మార్కెట్లు మరిన్ని లాభాలను అందించే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నో మంచి శుభవార్తలు దలాల్ స్ట్రీట్‌కు దన్నుగా నిలవచ్చు.. అదే సమయంలో కొన్ని షార్ట్ టర్మ్‌లో 2 స్టాక్స్‌ మంచి లాభాలను అందించవచ్చు అని విశ్లేషిస్తున్నారు ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ హెడ్ మహంతేష్ సబారద్. ఈటీ నౌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మార్కెట్ మూమెంట్ సహా అనేక అంశాలను వివరించారు.

ఆయన విశ్లేషణ ప్రకారం నిఫ్టీ ఇక్కడ కాస్త తడబడే సూచనలు ఉన్నాయి. నిఫ్టీ గత ఆరు వారాల నుంచి 12 వేల పాయింట్ల దగ్గరే కొట్టమిట్టాడుతోంది. ఇప్పటికిప్పుడు పెద్ద న్యూస్ ఏదీ లేకపోవడంతో మార్కెట్లకు దిశానిర్దేశం కరువైంది. దేశీయంగా అనేక గణాంకాలు నెగిటివ్‌గా వస్తాయని ఊహించినట్టే అలానే వచ్చాయి. అందుకే వీటిని కూడా మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది.

అతుల్ లిమిటెడ్
ఇక స్టాక్ స్పెసిఫిక్‌గా చూస్తే.. అతుల్ స్టాక్ బాగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అతుల్ ఓ కెమికల్ కంపెనీ స్టాక్. లైఫ్ సైన్సెస్ నుంచి ఇండస్ట్రియల్ కెమికల్స్ వరకూ అనేక ప్రోడక్ట్స్‌ను వీళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అవన్నీ మంచి పురోగతిని సూచిస్తున్నాయి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్, రుణరహిత కంపెనీ, 20 శాతానికి పైగా ఆర్ఓసీఈ (రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్) ఉన్నాయి. వేల్యుయేషన్స్ కూడా అంత ఎక్కువగా ఏమీ కనిపించడం లేదు.
ప్రస్తుత వేల్యుయేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే 20 ఫార్వర్డ్ పీఈతో స్టాక్ ట్రేడవుతోంది. కంపెనీ వివిధ విస్తరణ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. రాబోయే రెండేళ్లలో ఇందుకోసం రూ.500 కోట్ల వరకూ వెచ్చించడానికి సిద్ధమవుతోంది. వీటి వల్ల రెవెన్యూ సుమారు రూ.850 కోట్ల వరకూ పెరగొచ్చని కూడా యాజమాన్యం అంచనా వేస్తోంది.
అందుకే వివిధ మార్గాల్లో అతుల్ స్టాక్‌ను పరిశీలించి చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ స్టాక్‌కు మా టార్గెట్ రూ.5000 వరకూ ఉంది. (సిఎంపి రూ.4041)

శ్రీరాం సిటీ యూనియన్ పైనాన్స్

(సిఎంపి రూ.1400)
ఇదో ఎన్.బి.ఎఫ్.సి సంస్థ. శ్రీరాం పైనాన్స్ గ్రూపునకు చందిన సంస్థ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆటోమొబైల్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు రుణాలను ఇవ్వడంలో మంచి వాటాను చేజిక్కించుకున్న సంస్థ. పటిష్టమైన రిటర్న్ ఆన్ అసెట్స్‌తో పాటు ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేని సంస్థ శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్.
శ్రీరాం గ్రూపుతో కలిసి క్రాస్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ చేయడం మరో పాజిటివ్ అంశం. శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కేవలం వాహన రుణాలను మాత్రమే ఇస్తుంది. కానీ సిటీ యూనియన్ ఫైనాన్స్ మాత్రం అన్ని రుణాలనూ ఇస్తుంది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే.. ఈ స్టాక్ ఇక్కడి నుంచి 20 శాతం వరకూ పెరిగి రూ.1680 వరకూ చేరొచ్చని అనిపిస్తోంది.  

స్వల్ప నుంచి మధ్యకాలంలో ఈ రెండు స్టాక్స్ 20 శాతం వరకూ రాబడిని అందించవచ్చని అనిపిస్తోంది అంటారు మహంతేష్ సబారద్.

(గమనిక - ఇవి స్టాక్ రికమెండేషన్స్ కావు. కేవలం అవగాహన, సమాచారం కోసం మాత్రమే )