ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్‌ ఐపీఓ వివరాలు ఇవే..

ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్‌ ఐపీఓ వివరాలు ఇవే..

ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్‌ ఐపీఓ ఈనెల 18న ప్రారంభం కాబోతోంది. ఈనెల 20న ముగిసే ఈ ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ను ఒక్కో షేరుకు రూ.177-178గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం రూ.500 కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సమీకరిస్తుండగా... ఇందులో రూ.250 కోట్ల తాజా షేర్లు కాగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో రూ.250 కోట్ల నిధులను సేకరించనున్నారు. మర్చెంట్‌ బ్యాంకర్స్‌తో సంప్రదించిన తర్వాత కనీస బిడ్‌ లాట్‌ సైజును 84 ఈక్విటీ షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత 84 షేర్ల గుణిజాల పద్ధతిలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా జేఎం ఫైనాన్షియల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు ఉన్నాయి. ఈ నెలాఖరులో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు ట్రేడ్‌కానున్నాయి. 

కంపెనీ వివరాలు..
ఈ ఏడాది అక్టోబర్‌ 31 నాటికి కంపెనీ 6 ప్లాంట్లతో 2,41,211 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. రాజస్థాన్‌లోని జాబ్నర్‌లోని తమ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 6221 టన్నుల నుంచి 17,021 టన్నులకు, 2020 మార్చినాటికి 20,909 టన్నులకు పెంచాలని ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్‌ యోచిస్తోంది. 

కంపెనీ ప్రస్తుతం రెండు బ్రాండ్‌ (ప్రిన్స్‌ పైపింగ్‌ సిస్టమ్స్‌, ట్రూబోర్‌) పేర్లతో సేవలందిస్తోంది. CPVC, UPVC, HDPE, PPRతో పాటు 3 వేర్వేరు ఫిట్టింగ్‌ రకాలైన CPVC, PPR, UPVC పైపులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చక్కని సేల్స్‌ నెట్‌వర్క్‌ను కలిగివున్న ఈ కంపెనీ గత కొంతకాలం నుంచి వ్యాపార ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది. ఈ కంపెనీ బిజినెస్‌ మెరుగ్గా ఉండటంతో ప్రైమరీ మార్కెట్లో ఈ ఇష్యూకు చక్కని స్పందన వచ్చే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');