ఈవారం మార్కెట్లు హైజంప్

ఈవారం మార్కెట్లు హైజంప్

ఈవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 565 పాయింట్లు(1.40శాతం), నిఫ్టీ 165 పాయింట్లు (1.39శాతం), బ్యాంక్‌ నిఫ్టీ 673 పాయింట్లు(2.15శాతం) లాభపడ్డాయి. నవంబర్‌ మొదటి వారం తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. సైకలాజికల్‌ ఫిగర్‌ 41వేల మార్కును సెన్సెక్స్‌ అధిగమించగా... నిఫ్టీ 12 వేల ఎగువన ముగిసింది. ఈవారం బ్యాంక్‌ షేర్లకు అనూహ్య కొనుగోళ్ళ మద్దతు రావడంతో బ్యాంక్‌ నిఫ్టీ 32వేల మార్కును క్రాస్‌ చేసింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో కూడా ఒకశాతం పైగా లాభపడ్డాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి స్ట్రాంగ్‌గా ఉండటంతో ఐటీ, టెక్నాలజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 
123

top-gainers