కార్పొరేషన్‌ బ్యాంక్‌లో జోరు

కార్పొరేషన్‌ బ్యాంక్‌లో జోరు

ఈనెల్లోనే ఎస్పార్‌ స్టీల్‌ నుంచి చెల్లింపులు జరుగుతాయని రుణదాతల కమిటీ భావిస్తుండటంతో కార్పొరేషన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ల్లో ర్యాలీ కొనసాగుతోంది.  ఇంట్రాడేలో యూకో బ్యాంక్‌ 19శాతం, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 16 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం 8.50శాతం పైగా లాభంతో రూ.25.80 వద్ద కార్పొరేషన్‌ బ్యాంక్‌ ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో కార్పొరేషన్‌ బ్యాంక్‌ 60 శాతం పైగా లాభపడింది. 

అక్టోబర్ 18న ప్రతిపాదిత తీర్మాన ప్రణాళిక ప్రకారం ఎస్సార్ స్టీల్ తీర్మానం కొనసాగుతుందని భారత సుప్రీంకోర్టు నవంబర్ 15 న ప్రకటించింది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌కు సంబంధించిన సురక్షిత ఆర్థిక రుణదాతలకు ముందస్తుగా రూ.42,000 కోట్లు చెల్లించాలన్న ఆర్సెలర్ మిట్టల్ చేసిన ప్రతిపాదనకు కూడా సుప్రీం కోర్టు అంగీకరించింది. ఎస్‌బీఐకి రూ.12 వేల కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.2,282 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.1,400 కోట్లు పంపిణీ చేయడానికి రుణదాతల కమిటీ ఆమోదం తెలిపింది.