వరుసగా రెండోరోజూ కొనసాగిన జోరు

వరుసగా రెండోరోజూ కొనసాగిన జోరు

మెటల్స్‌, ఆటో స్టాక్స్‌ లీడ్‌ చేయడంతో వరుసగా రెండో రోజూ దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభించింది. దీంతో ట్రేడింగ్‌ ఆసాంతం మార్కెట్లు అప్‌ట్రెండ్‌లోనే పయనించాయి. చివరి గంటలో 12వేల మార్కును అధిగమించినప్పటికీ... ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో నిఫ్టీ విఫలమైంది. మొత్తం మీద నిఫ్టీ 11950 ఎగువన స్థిరపడింది. చివరకు సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభంతో 40,582 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,972 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు అరశాతం పైగా లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, పీఎస్‌ఈ సూచీలు ఒకశాతం పైగా పెరిగాయి. ఐటీ, టెక్నాలజీ ఇండెక్స్‌లు ఒకశాతం పైగా నష్టపోయాయి. 

బ్యాంక్‌ షేర్లలో జోరు..
గత కొంతకాలం నుంచి డౌన్‌ట్రెండ్‌లో ఉన్న యెస్‌ బ్యాంక్‌కు ఇవాళ అనూహ్యంగా భారీ కొనుగోళ్ళ మద్దతు లభించింది. యెస్‌ బ్యాంక్‌ దాదాపు 6శాతం లాభపడింది. దీంతో పాటు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పీఎన్‌బీలకు బయ్యింగ్‌ సపోర్ట్‌ లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా లాభపడింది. 

మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌ : యెస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ : టాటామోటార్స్‌ 7.14శాతం, యెస్‌ బ్యాంక్‌ 5.96శాతం, వేదాంతా 3.97శాతం, టాటా స్టీల్‌ 3.24శాతం, ఎస్‌బీఐ 2.89 శాతం

నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ : ఇన్ఫోసిస్‌ 2.63శాతం, ఒఎన్‌జీసీ 1.64శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.37శాతం, టీసీఎస్‌ 1.03శాతం, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ 0.94శాతం