కొత్త షేర్లతో ఈక్విటాస్‌ తుస్‌..

కొత్త షేర్లతో ఈక్విటాస్‌ తుస్‌..

ఇన్వెస్టర్లకు కొత్త షేర్లను కేటాయించేందుకు కంపెనీ బోర్డు అనుమతించడంతో ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఇన్వెస్టర్ల నుంచి రూ.250 కోట్ల నిధులను సేకరించినందుకు గాను ఈక్విటాస్‌ 4.74 కోట్ల షేర్లను కేటాయించాలని నిర్ణయించింది. షేర్‌ ముఖ విలువ రూ.10 కాగా  ఒక్కో షేరును రూ.52.68(రూ.42.68 ప్రీమియంతో కలిపి)కు కేటాయించాలని బ్యాంక్‌ నిర్ణయించింది. 

కొత్త షేర్ల జారీ ప్రకటనతో ఈక్విటాస్‌ కరెక్షన్‌కు గురవుతోంది. ఇంట్రాడేలో 5 శాతం పైగా కరెక్షన్‌కు గురైన ఈక్విటాస్‌ ప్రస్తుతం 4శాతం పైగా నష్టంతో రూ.101.35 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌ 79.53 లక్షలుగా నమోదైంది.