ప్రైస్ -వాల్యూమ్ బ్రేకవుట్

ప్రైస్ -వాల్యూమ్ బ్రేకవుట్

ఇవాళ కొన్ని స్టాక్స్‌లో ప్రైస్‌, వాల్యూమ్స్‌ బ్రేకవుట్‌ వచ్చింది. ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యంగా కొనుగోళ్ళ మద్దతు లభించడంతో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇంట్రాడేలో ఐదున్నర శాతం పైగా లాభపడింది. ప్రస్తుతం 5శాతం పైగా లాభంతో రూ.780.20 వద్ద ట్రేడవుతోంది. టెక్నికల్‌గా సపోర్ట్‌ రావడంతో దీపక్‌ నైట్రేట్‌ కూడా జోరుమీదుంది. ఇంట్రాడేలో ఈ స్టాక్‌ దాదాపు 5 శాతం లాభపడింది. ప్రస్తుతం 4శాతం లాభంతో రూ.351 వద్ద దీపక్‌ నైట్రేట్‌ కదలాడుతోంది. ఇక అవాస్‌ ఫైనాన్షియర్స్‌లోనూ ఇవాళ ప్రైస్‌, వాల్యూమ్‌ బ్రేకవుట్‌ వచ్చింది. ఈ స్టాక్‌ ఇంట్రాడేలో దాదాపు 6శాతం లాభపడింది. ప్రస్తుతం 4శాతం లాభంతో రూ.1910 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు దీపక్‌ నైట్రేట్‌లో 3.41 లక్షలు, మోతిలాల్‌ ఓస్వాల్‌లో 1.25 లక్షలు, ఆవాస్ ఫైనాన్షియర్స్ 91వేల వాల్యూమ్స్‌ నమోదయ్యాయి.