కొత్త డ్రగ్ అప్లికేషన్‌తో సిప్లాకు లాభాలు

కొత్త డ్రగ్ అప్లికేషన్‌తో సిప్లాకు లాభాలు

సిప్లా అనుబంధ సంస్థ అమెరికాలో IV ట్రెమడాల్‌ అనుమతి అప్లికేషన్‌ను సమర్పించింది. ఈ ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సిప్లా షేర్ ధర 2 శాతం పైగా లాభపడింది. సిప్లా అనుబంధ అయిన అవెన్యూ థెరప్యుటిక్స్... యూఎస్ఎఫ్‌డీఏకు ఈ దరఖాస్తును అందించింది.

వయోజనులలో ఓ మోస్తరు నుంచి తీవ్ర స్థాయి స్థాయి నొప్పి నివారణ కోసం ఈ డ్రగ్‌ను ఉపయోగిస్తారు. సహజంగా ఈ దరఖాస్తును 2 దశలలో 3 క్లినికల్ ఎఫికసీపై పరీక్షలు నిర్వహిస్తాయి. అలాగే 500 మంది పేషెంట్స్‌పై ఓపెన్-లేబుల్ సేఫ్ట్‌టీ స్టడీ నిర్వహిస్తారు.

కొత్త డ్రగ్ అప్లికేషన్ ప్రభావంతో సిప్లా షేర్ లాభాలతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 2.51 శాతం లాభంతో రూ. 461 వద్ద ట్రేడవుతోంది.