66 శాతం ప్రీమియంతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బంపర్ లిస్టింగ్

66 శాతం ప్రీమియంతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బంపర్ లిస్టింగ్

ఉజ్జీవన్ స్మాల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(USFB) ఇవాళ స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ అయింది. 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏకంగా 66% ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్టింగ్‌ అయింది. 

ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌పై అంచనాలు అధికమయ్యాయి. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ.22-24 ప్రీమియంతో లిస్ట్‌కావచ్చని ముందునుంచే అంచనా వినిపించాయి. ఇది ఇష్యూ ధర కంటే 66శాతం అధికం కావడం విశేషం. 


ఇది దాని పేరెంట్‌ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.4,300 కోట్ల కన్నా చాలా ఎక్కువ కావడం విశేషం.