గ్లోబల్ సపోర్ట్‌తో లాభాల ఓపెనింగ్

గ్లోబల్ సపోర్ట్‌తో లాభాల ఓపెనింగ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, 2020లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేదంటూ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్లలో కొనుగోళ్లకు కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 40534 వద్ద నిలవగా... నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11946 వద్ద ట్రేడవుతోంది. 140 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 31396 వద్ద నిలిచింది.

ఐటీ, టెక్నాలజీ మాత్రమే నెగిటివ్‌గా ఉండగా.. మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు అరశాతంపైగా లాభాల్లో ఉన్నాయి. 

నిఫ్టీలో యూపీఎల్, యెస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, సిప్లా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఓఎన్‌జీసీ, జీ ఎంటర్టెయిన్మెంట్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.