బ్రోకరేజ్‌లు మక్కువ చూపుతున్న 6 స్టాక్స్

బ్రోకరేజ్‌లు మక్కువ చూపుతున్న 6 స్టాక్స్

స్టాక్ మార్కెట్లు ఆల్‌టైం గరిష్టాలకు చేరువలో ఉన్న సమయంలో.. ఇప్పటికే కొన్ని స్టాక్స్ రికార్డు స్థాయిలలో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇంకా పెరిగేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తూ ఉంటారు.
బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరలను పెంచడం అంటే.. ఆయా స్టాక్స్‌లో ఇంకా ఎంత స్ట్రెంగ్త్ ఉందో చెప్పే అంశంగానే పరిగణించాలి.

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌కు ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించిన మోర్గాన్ స్టాన్లీ.. టార్గెట్ ధరను రూ. 1735గా తెలిపింది. ఆర్ఐఎల్ స్టాక్‌లో ఔట్‌పెర్ఫామెన్స్ మొదలైందని చెబుతున్న ఈ బ్రోకరేజ్ సంస్థ.. 15.2x F22e
P/E వద్ద 20% సగటున ప్రీమియంతో ట్రేడవుతోంది. తాజాగా టారిఫ్ పెంపు అనంతరం.. పన్ను చెల్లింపు తర్వాత ఆర్ఓసీఈ పెరుగుతుందని అంచనా వేసింది. "రెండు సంవత్సరాల కాలంలో ఆర్ఓసీఈ 11 శాతానికి పెరిగే
అవకాశం ఉండగా.. కన్జూమర్‌ల పోర్ట్‌ఫోలియోలకు కూడా లాభం చేకూర్చవచ్చు" అని తెలిపింది. అయితే, కెమికల్స్ వ్యాపారం సమీప కాలంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు.

ఆర్‌బీఎల్ బ్యాంక్
ఆర్‌బీఎల్‌కు అండర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించిన మోర్గాన్ స్టాన్లీ... టార్గెట్ ధరను రూ. 240గా తెలిపింది. అండర్‌వెయిట్ రేటింగ్ ఇవ్వడానికి ఆస్తుల నాణ్యతను కారణంగా బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అన్‌సెక్యూర్డ్ లోన్స్
పెరుగుతుండడంతో.. అధిక స్లిప్పేజెస్, క్రెడిట్ కాస్ట్‌ల పెరుగుదలకు అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

డాబర్
డాబర్ ఇండియాకు ఓవర్‌వెయిట్ ఇచ్చిన జేపీ మోర్గాన్.. రూ. 520 టార్గెట్ ధరను తెలిపింది. ఇప్పటికే చేపట్టిన కార్యకలాపాల ప్రణాళికలను యథాతథంగా అమలు చేసినా, ఈ సంస్థకు దేశీయ వాల్యూమ్ వృద్ధి
పెరుగుతుందని, తోటి ఎఫ్ఎంసీజీ సంస్థలను ఔట్‌పెర్ఫామ్ చేస్తుందని అంచనా వేసింది. ఓవర్సీస్‌లో కూడా మార్జిన్ ఔట్‌లుక్ పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ చెబుతోంది.

​యూబీఎల్
యూబీఎల్‌కు గోల్డ్‌మ్యాన్ శాక్స్ 'బయ్' రేటింగ్‌ ఇచ్చి, టార్గెట్ ధరను రూ. 1423గా నిర్ణయించింది. వచ్చే ఏడాది స్థూల మార్జిన్‌లు పెరుగుతాయని అంచనా వేసింది.

సిమెంట్ షేర్స్
అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ షేర్‌లను కొనుగోలు చేయవచ్చని జేపీ మోర్గాన్ చెబుతోంది. ప్రస్తుతం డిమాండ్ పెరిగే అవకాశాలు అంతగా లేకపోయినా, విస్తరణలు కొనసాగుతున్నాయి. కంపెనీ వాల్యుయేషన్స్, స్టాక్ వాల్యుయేషన్స్‌పై నియర్-టెర్మ్ ఫండమెంటల్స్ ఆధారపడతాయి. అయితే ఇప్పుడప్పుడే రీ-రేటింగ్ చేయవలసిన అవసరం లేదని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.