టెలికాం స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి

టెలికాం స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి

నిధుల సమీకరణ వార్తలతో భారతీ ఎయిర్‌టెల్‌లో రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం అరశాతం పైగా నష్టంతో రూ.445 వద్ద షేర్‌ కదలాడుతోంది. క్యూఐపీ, ఎఫ్‌సీసీబీ, ఎన్‌సీడీల ద్వారా నిధుల సమీకరణ చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి వచ్చేనెల 3న జరిగే బోర్డు మీటింగ్‌లో షేర్‌హోల్డర్ల అనుమతి పొందాలని నిర్ణయించింది. 

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు చెందిన టవర్‌, ఆప్టిక్‌ ఫైబర్‌ ఆస్తులను కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేసినట్ట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీంతో వరుసగా రెండో రోజూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం అరశాతం పైగా నష్టంతో రూ.1552 వద్ద షేర్‌ కదలాడుతోంది. మరోవైపు వరుసగా నాల్గో రోజూ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఆర్‌కామ్‌ 5శాతం నష్టంతో రూ.1 వద్ద కదలాడుతోంది.