స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (డిసెంబర్ 11)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (డిసెంబర్ 11)
 • ఒరాకిల్ ఫైనాన్షియల్‌ : ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ విశాల్‌ సిక్కాను బోర్డు డైరెక్టర్‌గా నియమించిన ఒరాకిల్‌
 • భారతీ ఎయిర్‌టెల్‌: దాదాపు రూ.21 వేల కోట్ల నిధుల సమీకరణకు జనవరి 3న జరిగే ఏజీఎంలో వాటాదార్ల ఆమోదం పొందే యోచనలో భారతీ ఎయిర్‌టెల్‌
 • ఆర్‌ఐఎల్‌ : యూఏఈలో ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం అబుధాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • దిలీప్‌ బిల్డ్‌కాన్‌ : ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌కు తక్కువ బిడ్‌ను దాఖలు చేసిన కంపెనీ, ప్రాజెక్ట్‌ విలువ రూ.825.62 కోట్లు
 • యస్ బ్యాంక్: సైటాక్స్ హోల్డింగ్స్, సైటాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ఇచ్చిన 500 మి. డా. ఆఫర్‌ను పరిశీలిస్తున్న బ్యాంక్
 • మహీంద్రా సీఐఈ: అనిల్ హరిదాస్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించిన బోర్డ్
 • GHCL: కమర్షియల్ పేపర్లకు "IND A1+" రేటింగ్ ఇచ్చిన ఇండియా రేటింగ్స్
 • పిరమల్ ఎంటర్‌ప్రైజెస్: కెనడియన్ పెన్షన్ ఫండ్ CDPQ ఇచ్చే కంపల్సరిలీ కన్వర్టబుల్ డిబెంచర్‌ల సబ్‌స్క్రిప్షన్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆమోదం
 • ఫ్యూచర్ సప్లై చైన్: ఇండియాకు చెందిన ఫ్యూచర్ సప్లై చైన్‌లో నిప్పాన్ ఎక్స్‌ప్రెస్ 22 శాతం వాటా కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం
 • ఐడీబీఐ బ్యాంక్: అనుబంధ సంస్థలు ఐడీబీఐ క్యాపిటల్, ఐడీబీఐ ఇన్‌టెక్‌లలో 49 శాతం వాటా విక్రయానికి బోర్డ్ ఆమోదం


కమాడిటీస్ కార్నర్..

 • గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ (31.1 గ్రా.) బంగారం ధర 1466.20 డాలర్లు 
 • 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ ధర రూ.35,940
 • 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ ధర రూ.39,210, కేజీ వెండి ధర రూ.47,490    
 • డాలర్‌తో పోలిస్తే 70.82 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ 
 • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 63.89డాలర్లు