స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (డిసెంబర్ 05)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (డిసెంబర్ 05)
 • రుణాలు ద్వారా రూ.21500 కోట్ల నిధులను సమీకరించే యోచనలో భారతీ ఎయిర్‌టెల్‌
 • వచ్చే ఏడాది మార్చినాటికి సామర్థ్య వృద్ధి రేటు 22-23 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోన్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
 • రేపు కొత్త ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ను ప్రారంభించనున్న రిలయన్స్‌ జియో, 300శాతం అదనపు లాభాలు ఉంటాయన్న కంపెనీ
 • డిసెంబర్‌ 10న జరిగే బోర్డు మీటింగ్‌లో డివిడెండ్‌ అంశాన్ని పరిశీలించనున్న భారతి ఇన్‌ఫ్రాటెల్‌
 • డిబెంచర్ల జారీ ద్వారా రూ.3వేల కోట్లను సమీకరించడానికి వేదాంతా బోర్డు ఆమోదం
 • బోర్టెజోమిబ్‌ ఇంజెక్షన్‌(3.5 ఎంజీ)ను అమెరికా మార్కెట్లో విడుదల చేసిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌
 • వాటాను తగ్గించుకోవడం, రుణం ద్వారా 4 బిలియన్‌ డాలర్ల సమీకరణకు భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం
 • కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు, బ్యాంకుల పిటీషన్‌ను తిరస్కరించిన సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌
 • తమ వద్ద తనఖాకు ఉన్న క్లయింట్ల షేర్లను బదిలీ చేయడాన్ని సవాలు చేసిన బ్యాంకులు
 • వచ్చేనెల నుంచి వివిధ మోడళ్లపై కార్ల ధరలను రూ.15వేల వరకు పెంచే అవకాశముందని ప్రకటించిన టాటా మోటార్స్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మహామాయ స్టీల్‌, జేపీ అసోసియేట్స్‌, కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌, జేపీ పవర్‌ వెంచర్స్‌
 • షార్ట్‌ టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న టిప్స్‌ ఇండస్ట్రీస్‌
 • ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతానికి సవరింపు