FIIలు మెచ్చిన స్టాక్స్; మల్టీబ్యాగర్స్‌గా 3 స్క్రిప్స్

FIIలు మెచ్చిన స్టాక్స్; మల్టీబ్యాగర్స్‌గా 3 స్క్రిప్స్

గత సంవత్సరంలో అనేక స్టాక్స్ కరెక్షన్‌కు గురైన, స్మాల్&మిడ్‌క్యాప్ విభాగంలో రికవరీపై ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బెట్టింగ్ చేస్తున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత నాలుగు త్రైమాసికాల్లో 145 స్టాక్‌లలో వాటాను పెంచుకున్నారు. వాటిలో మూడు స్టాక్స్ పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేశాయి.

భారతి ఎయిర్‌టెల్, ఒఎన్‌జిసి, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, వేదాంత, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి, ఇన్ఫోఎడ్జ్, ముత్తూట్ ఫైనాన్స్‌లలలో ఎఫ్‌పిఐలు వాటాను పెంచుకున్నారు.

అయితే ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసినవాటిలో 50 శాతం స్టాక్స్ ప్రతికూల రాబడిని ఇవ్వడం గమనించాలి. 

మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లపై ఎఫ్‌పీఐలు బెట్టింగ్ చేస్తుండడంతో...  ఈ విభాగాల్లో కదలిక కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్ గత కొంతకాలంగా భారీగా కరెక్షన్ కావడంతో... చాలా తక్కువ ధరకు  లభించే స్టాక్స్ ఉన్నాయి.

ఆర్థిక పునరుజ్జీవనం, ఆదాయాలు, రికవరీ వంటి అంశాలు స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్‌లపై ఆసక్తిని పెంచుతున్నాయి. గత ఒకటిన్నర సంవత్సరాలుగా మార్కెట్లలో వీటి పనితీరు ప్రతికూలంగా ఉందని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.

ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వినియోగం, వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే.. రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బిఐ లైఫ్, డాక్టర్ లాల్, ఐజిఎల్ వంటి స్టాక్స్‌ను సహజంగానే మంచి రాబడి ఇచ్చే స్టాక్స్‌గా చెబుతారు. ఇవి ఆయా ఇండస్ట్రీలలో మార్కెట్ లీడర్స్ అనే విషయం గమనించాలి.

మల్టీబ్యాగర్లు
హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి, ఆవాస్ ఫైనాన్షియర్స్, హిందూస్తాన్ ఫుడ్స్.. మొత్తంత 145 స్టాక్స్‌లో మూడు, గత ఏడాదిలో పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేశాయి. ఈ కంపెనీలు మంచి రాబడి రికార్డును కలిగి ఉన్నాయి, అలాగే కార్పొరేట్ గవర్నెన్స్ వీటికి కలిసొచ్చే విషయం. 

హెచ్‌డిఎఫ్‌సి ఎఎమ్‌సి, ఆవాస్ ఫైనాన్షియర్స్ మరియు హిందూస్తాన్ ఫుడ్స్ స్టాక్‌లకు... మంచి భవిష్యత్ అవకాశాలతో పాటు శక్తివంతమైన కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థ ఉంది. అయితే ఈ స్టాక్‌ల ధరలు బాగా పెరగడంతో..  ప్రస్తుత స్థాయిలలో వీటిని కొనుగోలు చేయడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఈ స్టాక్స్‌లో కరెక్షన్ వచ్చినప్పుడు కొనుగోలుకు అవకాశంగా పరిశీలించవచ్చు.