హిందుజాకు కొత్త ఆర్డర్‌ జోష్‌

హిందుజాకు కొత్త ఆర్డర్‌ జోష్‌

హిందుజా గ్రూపునకు చెందిన అశోక్‌ లేలాండ్‌కు 1750 బస్సుల తయారీ కాంట్రాక్టు లభించింది. తమిళనాడు స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ర్‌టేకింగ్స్‌ నుంచి ఈ అవార్డును పొందినట్టు కంపెనీ తెలిపింది. ఈ అవార్డ్‌ రావడం తమకెంతో సంతోషంగా ఉందని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనుజ్‌ కతూరియా తెలిపారు. మెరుగైన టెక్నాలజీ, ఇన్నోవేషన్‌తో తాము దేశీయంగా బస్సుల తయారీలో లీడర్‌షిప్‌ స్థానంలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆర్డర్‌తో తమ ఆర్డర్‌ బుక్‌ విలువ మరింత పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌(MHCV) సంజయ్‌ సరస్వత్‌ వెల్లడించారు. 

ప్రస్తుతం బస్సుల తయారీలో అశోక్‌లేలాండ్‌ దేశంలో తొలి స్థానంలో ఉండగా... ప్రపంచంలో నాల్గో స్థానంలో ఉంది. ఇలాంటి ఆర్డర్‌లతో ప్రపంచ మార్కెట్లో తాము లీడర్‌షిప్‌ స్థాయిని పొందేందుకు మార్గం సులభం అవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇక కొత్త ఆర్డర్‌ రాకతో స్టాక్‌ మార్కెట్లో అశోక్‌లేలాండ్‌ ప్రస్తుతం ఒకశాతం పైగా లాభంతో 81.55 వద్ద కదలాడుతోంది. ప్రస్తుతం కంపెనీ రూ.24,306.17కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కలిగివుంది. P/E 18.64, ఈపీఎస్‌ 4.44గా ఉంది.