41 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్

41 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వరుసగా లాభాల ట్రెండ్‌ నమోదు చేస్తున్న మార్కెట్లకు గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లభిస్తోంది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్‌పై సయోధ్య కుదిరే అవకాశాలు ఉన్నాయనే సూచనలు.. మన మార్కెట్లలో జోష్ నింపుతున్నాయి.

ప్రధాన ఇండెక్స్ స్టాక్స్‌లో జోరుగా కొనుగోళ్లు జరుగుతుండడంతో... సూచీలు ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 41008 వద్ద ట్రేడవుతోంది. తొలిసారిగా సెన్సెక్స్ 41 వేల పాయింట్లను అధిగమించింది. ప్రస్తుతం నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 12,087 వద్ద నిలిచింది. 119 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 31837 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం నిఫ్టీలో యస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్ మోటార్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.... సిప్లా, భారతి ఇన్‌ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్, భారత్ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్‌లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.