స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 27)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 27)
 • కంపెనీ చైర్మన్‌ రాజీనామాతో వరుసగా రెండోరోజూ నష్టపోయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
 • దేశవ్యాప్తంగా 6 కొత్త హోటల్స్‌ను ఏర్పాటు చేసేందుకు మారియట్‌ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌
 • నవంబర్‌ 29న బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణపై చర్చించనున్న యెస్‌ బ్యాంక్‌ బోర్డు
 • కేంద్ర ప్రభుత్వానికి రూ.3353 కోట్ల విలువైన 158.4 కోట్ల షేర్లను కేటాయించిన సెంట్రల్‌ బ్యాంక్‌
 • బోనస్‌ ఇష్యూకు డిసెంబర్‌ 7ను రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
 • ఫార్మెక్స్‌ అనే తమ అనుబంధ సంస్థను మరో సబ్సిడరీ అయిన మ్యాక్స్‌ ఎస్టేట్స్‌కు రూ.60.73 కోట్లకు విక్రయించిన మ్యాక్స్‌ ఇండియా
 • టాటా కమ్యూనికేషన్స్‌ కొత్త ఎండీ, సీఈఓగా ఐదేళ్ళ కాలానికి నియమితులైన అమూర్‌ స్వామినాథన్‌ లక్ష్మినారాయణ్‌
 • రైట్స్‌లో ఒఎఫ్‌ఎస్‌ తర్వాత 87.4 శాతం నుంచి 77.4 శాతానికి తగ్గనున్న  ప్రభుత్వం వాటా
 • ఎన్‌సీడీల ద్వారా రూ.60 కోట్ల నిధులను సమీకరించేందుకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ బోర్డు ఆమోదం
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న టిప్స్‌ ఇండస్ట్రీస్‌, స్టాంపెడె క్యాపిటల్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌
 • హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌, టిప్స్‌ ఇండస్ట్రీస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతానికి సవరింపు


కమోడిటీ అప్‌డేట్స్‌..

 • రెండు వారాల కనిష్టానికి గోల్డ్ రేట్‌, ఔన్స్‌ ధర 1459.29 డాలర్లు
 • 24 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ.39,410   
 • 22 క్యారెట్ 10 గ్రాముల రిటైల్ ధర రూ.36,130   
 • చెన్నై మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,300    
 • స్వల్పంగా తగ్గిన బ్రెండ్‌ క్రూడ్‌, బ్యారెల్‌ ధర 64.05 డాలర్లు
 • 58.4 డాలర్లుగా ఉన్న నైమెక్స్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర
 • డాలర్‌తో పోలిస్తే 71.48 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ

ఐపీఓ అప్‌డేట్స్..

 • సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓకు విశేష స్పందన, 86.90 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌
 • మొత్తం 1,15,54,987 షేర్లకు గాను 100 కోట్లకు పైగా షేర్లకు బిడ్‌లు దాఖలు
 • క్యూఐపీ విభాగంలో 62.18 రెట్లు, రిటైల్‌ విభాగంలో 44.38 రెట్ల స్పందన
 • డిసెంబర్‌ 4న స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కానున్న సీఎస్‌బీ బ్యాంక్‌, రూ.70-75గా ఉన్న గ్రే మార్కెట్‌ ప్రీమియం