లాభాల ఆరంభానికి ఛాన్స్!

లాభాల ఆరంభానికి ఛాన్స్!

ఇవాళ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రానున్న పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించొచ్చన్న అంచనాలను ఉన్నాయన ిబ్యాంకింగ్ వర్గాలు,స్టాక్ మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్, రీటైల్ వంటి స్పెసిఫిక్ సెక్టార్లకు మద్దతు లభించే అవకాశం ఉంది.

గత రాత్రి అమెరికా మార్కెట్లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్‌అండ్‌పీ, డౌజోన్స్‌, నాస్‌డాక్‌ సూచీలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమంగా ఉండగా.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్ప లాభంతో  12100 ఎగువన ట్రేడ్‌ అవుతోంది. 12139 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్‌ రికార్డ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నమోదు చేసింది.