CSB IPO.. అప్లై చేసే ముందు ఇవి చూడండి

CSB IPO.. అప్లై చేసే ముందు ఇవి చూడండి

ఒకప్పటి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్.. ఇప్పుడు సిఎస్‌బిగా పేరు మారిన బ్యాంక్ ఐపీఓ నేటి నుంచి ప్రారంభమైంది. దేశంలోని పాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటైన ఈ సంస్థ ఐపీఓ ఈ నెల 26వ తేదీన ముగియబోతోంది. ఐపీఓ ప్రైసింగ్ రూ.193-195 మధ్య నిర్ణయించారు. తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ఇష్యూ నుంచి రూ.410 కోట్లను సమీకరించబోతున్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్ల జారీ ద్వారా రూ.24 కోట్లు, తాజాగా 1.97 కోట్ల షేర్ల అమ్మకం (ఆఫర్ ఫర్ సేల్)  ద్వారా రూ.385 కోట్లను సమీకరిస్తున్నారు. 

లాట్ సైజ్ 
కనీసం 75 షేర్లు.. ఆపై మల్టిపుల్స్ ఆఫ్ 75

అలాట్మెంట్, లిస్టింగ్ తేదీలు
ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈ షేర్లు లిస్ట్ కాబోతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన అలాట్మెంట్, డిసెంబర్ 4వ తేదీన లిస్టింగ్ కావొచ్చని భావిస్తున్నారు. 
లింక్ ఇన్ టైం సంస్థ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా జారీ చేస్తున్న షేర్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల, ప్రమోటర్ సంస్థ అయిన ఫెయిర్ ఫాక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ వాటా 50.09 నుంచి 49.73 శాతానికి తగ్గుతుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్ వాటా ఐదేళ్లలో 40 శాతానికి, పదేళ్లలో 30 శాతానికి, పదిహేనేళ్లలో 15 శాతం లోపే ఉండాలి. 

ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బ్యాంక్ ఇంతకాలం ఓ మూస పద్ధతిలో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నూతన వ్యూహాత్మక మార్పులు తీసుకుని వచ్చి వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తున్నారు. కెనెడియన్ బిలయనీర్ ప్రేమ్ వత్సకు చెందిన ఫెయిర్ ఫాక్స్ హోల్డింగ్ ప్రమోటింగ్ సంస్థలో ఉండడంతో ఇన్వెస్టర్లలో ఆశలు ఎక్కువగా ఉన్నాయి. 

సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ నెట్వర్క్ 412 శాఖలకు విస్తరించింది. స్థూల ఎన్‌పిఏలు 7.25 నుంచి 4.87 శాతానికి దిగొచ్చాయి. సెప్టెంబర్ 30 నాటికి ముగిసిన త్రైమాసికానికి ఇది 2.86 శాతానికి తగ్గింది. నెట్ ఎన్‌పిఏల భారం కూడా 1.96 శాతానికి పరిమితమైంది. 

గోల్డ్ మేజర్ బిజినెస్
గోల్డ్ లోన్స్.. ఈ బ్యాంకుకు ప్రధాన బిజినెస్. సంస్థ ఇస్తున్న అడ్వాన్సుల్లో 33.17 శాతం వాటా ఈ వ్యాపారం నుంచే వస్తోంది. ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో 44 కోట్ల లాభాన్ని బ్యాంక్ ఆర్జించింది. 

రిస్క్ ఫ్యాక్టర్స్..
పూర్తిగా దక్షిణ భారత, అది కూడా కేరళ రాష్ట్రంలోనే వ్యాపారం నిర్వహించడం
రాబోయే మూడు నాలుగేళ్లలో 350 నుంచి 400 కొత్త శాఖలను ప్రారంభించాలని బ్యాంక్ యోచిస్తోంది. దీని వల్ల ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. 
డిసిబి, సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులతో పోలిస్తే వేల్యుయేషన్ 
ఎక్కువగా ఉంది. అంత ప్రీమియం చెల్లింపు రిస్కీగా ఉంది. 

బలం
కొత్త ప్రమోటర్, పటిష్ట యాజమాన్యం