LIC ఫేవరెట్ స్టాక్స్ ఇవే ! ఇప్పటికే 50 శాతం లాభాలు

LIC ఫేవరెట్ స్టాక్స్ ఇవే ! ఇప్పటికే 50 శాతం లాభాలు

దేశ ప్రముఖ సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ లాభాలను కురిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్‌లో నికర లాభం 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. వాటిల్లో ప్రధానంగా పెయింట్స్, ఫైనాన్షియల్స్, డిఫెన్స్, ఫార్మా, మెటల్స్, ఇన్సూరెన్స్, పీఎస్‌యూ సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక ఏడాది రెండో క్వార్టర్‌ నుంచి వీటిపై అధిక శాతం మంది ఎనలిస్టులు బుల్లిష్‌గా మారారు. 

ఎల్‌ఐసికి ఉన్న పోర్ట్‌ఫోలియోలో అధిక లాభాలను అందించిన సంస్థ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలన్నీ 50 నుంచి 400 శాతం వరకూ లాభాలను అందించాయి. 

హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్ సంస్థ ఎస్బీఐ పై ఇప్పటికీ బయ్ రేటింగ్‌నే ఇస్తోంది. టార్గెట్ ప్రైస్‌ను రూ.389గా నిర్ణయించింది. అసెట్ క్వాలిటీ మెరుగవడాన్ని ఎనలిస్టులు పాజిటివ్‌గా చూస్తున్నారు. ఇయర్ టు ఇయర్ బేసిస్ ప్రకారంగా చూస్తే.. ఎస్బీఐ స్టాక్ 7.57 శాతం లాభాలను అందించింది. 

ఎల్ఐసికి ఉన్న పోర్ట్‌ఫోలియోలో కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇంద్రప్రస్థా గ్యాస్, జీఎస్‌కె ఫార్మా, ఫెడరల్ బ్యాంక్ స్టాక్స్ మెరుగైన లాభాలను అందించాయి. 

ఎల్ఐసీకి ఉన్న పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌లో 50 శాతానికి పైగా నికర లాభాలను అందించిన స్టాక్స్ జాబితాను పరిశీలిస్తే 37 కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఎల్ఐసి దగ్గర ప్రస్తుతం 370 స్టాక్స్ ఉన్నాయి. 

ఈ పోర్ట్‌ఫోలియోలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 145 శాతం లాభాలను అందించింది. ఈ సంస్థ నికర అమ్మకాలు 100 శాతం, నికర లాభం 300 శాతం వృద్ధి చెందాయి. 

బెంగాల్ అండ్ అస్సాం కంపెనీ, భారత్ డైనమిక్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, క్యాప్రిహాన్స్, చంబల్ ఫర్టిలైజర్స్, హడ్కో, గేట్ వే డిస్ట్రిబ్యూటర్స్, ఇండియన్ బ్యాంక్, ఏబిబి ఇండియా, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, గ్రాన్యూల్స్ ఇండియా వంటి సంస్థలు నికర లాభంలో 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. 

ఇక మిడ్, స్మాల్ క్యాప్ స్పేస్‌లో ఆదిత్య బిర్లా, ఫైజర్, న్యూ ఇండియా అస్యూరెన్స్, దాల్మియా భారత్, టోరెంట్ పవర్, మిశ్రధాతునిగం, గ్రాన్యూల్స్ ఇండియా స్టాక్స్ 50 నుంచి 110 శాతం వరకూ నికర లాభాలను అందించాయి. అమ్మకాల్లో 50 శాతం వృద్ధిని కనబర్చాయి. 

ఈ స్టాక్స్ అన్నీ ఎల్ఐసికి లాభాల వర్షం కురిపిస్తున్నాయి. 

(ఈ స్టాక్స్ కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడులు పెట్టేముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించండి)