నెట్వర్క్ 18పై సోనీ కన్ను 

నెట్వర్క్ 18పై సోనీ కన్ను 

ముకేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న నెట్వర్క్ 18లో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థ సోనీ ఆసక్తిని కనబరుస్తోంది. దేశంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, దేశీయ మీడియా సంస్థల్లో పెట్టుబడుల కోసం సోనీ సంస్థ గత పది నెలల్లో రెండో సారి ప్రయత్నిస్తోంది. 

మార్చి నెలలో సోనీ సంస్థ జీ ఎంటర్‌టైన్మెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రమోటర్ల నుంచి కనీసం 20 శాతం వాటాను కొనుగోలు చేయాలని భావించింది. అయితే అప్పటికే పరిస్థితులు చేజారి పోవడంతో ప్రమోటర్లు చేతులెత్తేశారు. దీంతో సోనీ యాజమాన్యం నిరుత్సాహపరిచింది. ఆ తర్వాత జరిగిన చర్చల్లో వేల్యుయేషన్స్‌పై క్లారిటీ లేకపోవడం, అనిశ్చితి వంటివి దూరం పెట్టాయి. 

తాజా ఆలోచనల నేపధ్యంలో నెట్వర్క్ 18ను సోనీలో విలీనం చేసుకోవాలని ఈ జపనీస్ సంస్థ భావిస్తోంది. మీడియాలో ఎఫ్‌డిఐ అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడి పెట్టాలనేది సోనీ లక్ష్యం. ఇండియన్ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని, ఎంటర్‌టైన్మెంట్ స్పేస్‌లో లీడర్‌గా ఎదిగేందుకు సంస్థ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతానికి న్యూస్ రంగంలో ఎఫ్.డి.ఐ పరిమితి కేవలం 26శాతమే ఉంది. 

నెట్వర్క్ 18 ఎలా ఉంది
నెట్వర్క్ 18 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3045 కోట్ల అప్పును మోస్తోంది. నికరంగా రూ.2860 కోట్ల రుణభారం ఉంది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2900 కోట్ల వరకూ ఉంది. ఇక సంస్థ విషయానికి వస్తే.. టీవీ18, వయాకామ్ వంటి సంస్థలను నిర్వహిస్తోంది.