తదుపరి ర్యాలీని లీడ్‌ చేసే రంగాలివే..!

తదుపరి ర్యాలీని లీడ్‌ చేసే రంగాలివే..!

మల్టీ బ్యాగర్స్‌ను పట్టుకోవడం కత్తిమీద సామే. కష్ట సమయాల్లో సరైన కంపెనీని గుర్తించే సామర్థ్యం అందరికీ ఉండదు. అలాంటి స్టాక్స్‌ను పట్టుకోవాలంటే మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇక ఇప్పటివరకు మార్కెట్ల ట్రెండ్‌ రోజుకో విధంగా ఉంది. ప్రస్తుతం బేర్‌ ట్రెండ్‌ సమసి పోయినట్టు కనిపిస్తోంది. ఈ సమయంలో మార్కెట్లను ఏఏ స్టాక్స్‌ను లీడ్‌ చేస్తాయో ఈ కథనంలో చూద్దాం.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాల స్టాక్‌లు భారీ అమ్మకాలకు గురైనప్పుడు, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కొన్ని సముచిత విభాగాల నుండి ఎంచుకున్న కౌంటర్లు రికార్డు స్థాయి వద్ద ట్రేడవుతోన్నాయి.  ఇన్సూరెన్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, పెయింట్స్, ఫుట్‌వేర్‌, రిటైలింగ్‌, కేబుల్‌ రంగాల్లో కొన్ని షేర్లకు ఊహించని రీతిలో రిటర్న్స్‌ వచ్చాయి. 

ఇన్సూరెన్స్‌ రంగం విషయానికి వస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బిఐ లైఫ్ వంటి హెవీ వెయింట్ స్టాక్స్‌ గత పక్షం రోజులుగా రికార్డు స్థాయి గరిష్టం వద్ద కదలాడుతోన్నాయి. 

"అసెట్‌ మేనేజ్‌మెంట్‌ స్పేస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, రిలయన్స్‌ నిప్పన్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఈ స్టాక్స్‌లో ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశముందని" మారథాన్‌ ట్రెండ్‌-పీఎంఎస్‌కు చెందిన ఎనలిస్ట్‌ అతుల్‌ సూరి అభిప్రాయపడ్డారు. "ఇన్సూరెన్స్‌ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడానికి ఒక కారణం ఉంది. ఈ రంగం అందించే రిటర్న్స్‌పై ఇన్వెస్టర్లు సంతృప్తిగా ఉన్నారు." అని  ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్యామ్‌సుందర్ భట్ చెప్పారు

ప్రపంచంలోనే అతిపెద్ద ఇండెక్స్ ఎంఎస్‌సిఐ గత నెల్లో బెర్గర్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్‌బిఐ లైఫ్‌లను తమ ఇండెక్స్‌లో చేర్చింది. పెయింట్ కంపెనీలు అక్జో నోబెల్ (రూ.2,275), ఏషియన్ పెయింట్స్ (రూ.1,833), బెర్గర్ పెయింట్స్ (రూ.534)లు రికార్డు స్థాయి గరిష్ట స్థాయి వద్ద కదలాడుతోన్నాయి. 

ఫుట్‌వేర్‌ తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. వచ్చే ఐదేళ్ళలో 500 స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బాటా ఇండియా తెలిపింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో బాటా ఇండియా నికరలాభం 30 శాతం వృద్ధితో రూ.71.30 కోట్లుగా నమోదైంది. సంవత్సరానికి 50 శాతం రిటర్న్స్‌తో రిలాక్సో, బాటా ఇండియాలు దలాల్ స్ట్రీట్లో సంచలనం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ కన్నా మెరుగ్గా 11 శాతం లాభపడ్డాయి.