ఇక పీఎంఎస్‌‌ సేవలు కావాలంటే రూ.50 లక్షలు కావాలి 

ఇక పీఎంఎస్‌‌ సేవలు కావాలంటే రూ.50 లక్షలు కావాలి 

పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫండ్స్‌లో ఇకపై కనీస పెట్టుబడి రూ.50 లక్షలకు పెంచుతూ సెబీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే కొనసాగుతున్న కాంట్రాక్టుల గడువు ముగిసేంత వరకూ పీఎంఎస్ అగ్రిమెంట్లు కొనసాగుతాయని సెబీ వెల్లడించింది. 

వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా సెబీ వెల్లడించింది. 

పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నెట్వర్త్ కనీసం రూ.5 కోట్లు ఉండాలి. గతంలో ఇది రూ.2 కోట్లు మాత్రమే ఉండేది. 
పోర్ట్‌ఫోలియో మేనేజర్లు లిస్ట్ కాని సెక్యూరిటీల్లో 25 శాతానికి మించి పెట్టుబడి పెట్టకూడదు. 
పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అందరూ ఖచ్చితంగా ఓ కస్టోడియన్‌ను నియమించుకోవాలి. అయితే కేవలం అడ్వైజరీ సేవలను మాత్రమే అందించే వాళ్లకు మినహాయింపు ఉంది. 

వీటితో పాటు మరికొన్ని లిస్టెడ్ కంపెనీ సంబంధ నిర్ణయాలు -
ఇకపై లిస్టెడ్ సంస్థలు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీ లేదా అసలును చెల్లించడంలో విఫలమైనప్పుడు 24 గంటల్లోనే ఈ సమాచారాన్ని ఎక్స్ఛేంజీలకు అందజేయాలి. 
ఇకపై లిస్టెడ్ సంస్థలు ప్రతీ ఏడాదీ వార్షిక నివేదికలో బిజినెస్ రెస్పాన్సిబులిటీ రిపోర్టింగ్‌ను జత చేయాలి.